నేటి నుంచి (16వ తేదీ ) నిర్వహించే మండల స్థాయి సభలను విజయవంతం చేయండి -

రంగారెడ్డి జిల్లా కలెక్టర్  సి.నారాయణ రెడ్డి. 

నేటి నుంచి (16వ తేదీ ) నిర్వహించే మండల స్థాయి సభలను విజయవంతం చేయండి -

     రంగారెడ్డి జిల్లా బ్యూరో,  లోకల్ గైడ్                           నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా జరిగే మండల స్తాయి సభలను విజయవంతంగా చేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. 
బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు, ఆర్డీఓలు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ  కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల వార్డు సభలు సమర్దవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ సూచన మేరకు, జిల్లాలో ప్రతి మండలంలో పాఠశాల/మండల కార్యలయం/బహిరంగ ప్రదేశం/ ఏదైనా ఇతర అనువైన వేదికను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటలకు మండల స్థాయి సభలను ప్రారంభించాలని, మండల స్థాయి సభలలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, గౌరవ మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించాలని, గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చదివి వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాల పై చర్చించాలని, మండల స్థాయి సభలలో తహశీల్దార్, ఎంపిడిఓ, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉండేలా చూడాలని సూచించారు. మహిళలు వృద్ధులు కూర్చునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని,  ప్రదర్శన కోసం స్క్రీన్ మరియు ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని, వేసవి కాలం అయినందున  త్రాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేయాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ బ్యానర్ ప్రదర్శించాలని సూచించారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి మండల స్థాయి సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. 
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఆర్డీఓలు, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణ రెడ్డి, సిపిఓ సౌమ్య, జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News