పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 

- అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు.

పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 

అలంపూర్, లోకల్ గైడ్ : అయిజ మండలం ఎంపీడీవో సి.వెంకటయ్య పదవి విరమణ పంచాయతీ సెక్రటరీలు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డిపిఓ నాగేంద్రం, మండల తహసిల్దార్ ఎన్.జ్యోతి, ఎంఈఓ డి రాములు, రెడ్ క్రాస్ సొసైటీ ఎండీ తాహీర్, హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసాపేట మండలంలో పుట్టి మొట్టమొదటిసారిగా టైపిస్టుగా జాబ్ సాధించి అంచలంచెలుగా ఎదిగి  ఎంపిడివోగా ప్రమోషన్ పొందారని అన్నారు. ఎంపీడీవోగా అయిజ మండలంలో సుమారు 15 నెలలు విధులు నిర్వహించి అందరితో మంచిగా ఉంటూ మన్ననలు పొందాలని ఆయన కొనియాడారు. ఇంత పెద్ద మండలంలో విధులు నిర్వహించడం అంటే కత్తిమీద సాము లాంటిది అయినా అన్ని గ్రామాల, ప్రజా ప్రతినిధులతో, నాయకులతో, ప్రజాసంఘాల నాయకులతో కలసి సమన్వయంగా సుదీర్ఘ సేవలందించి మండలాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. పదవి విరమణ అనంతరం ఎంపీడీవో వెంకటయ్య  కుటుంబ సభ్యులతో కలసి  సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం డిపిఓ, తాసిల్దార్ లు శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీలు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News