తండ్రిని హతమార్చిన కొడుకు.
- మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన కిరాతకుడు. - అనంతరం పోలీసులకు ఫోన్ చేసి పరారీ. - పెద్దేముల్ మండలంలో ఘటన.
లోకల్ గైడ్/ తాండూర్: మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామానికి చెందిన తలారి హనుమంతు (70) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉండేవాడు. హనుమంతు కుమారుడు అయినటువంటి నిందితుడు తలారి రవి నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. ఒక ఎకరా భూమి తన పేరుమీద పట్టా చేయమని తల్లిదండ్రుల పైన గొడవ పడి ఘోరంగా హింసించేవాడు. అయితే, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తలరి రవి ఎప్పటిలాగే మద్యం సేవించి వచ్చి, ఇంట్లోనే ఉన్న తండ్రి హనుమంతును బలమైన ఇనుప ఆయుధంతో ముఖం,నుదుటిపైన కొట్టడంతో,తీవ్ర రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై వేణు కుమార్ తెలిపారు.అంతేకాకుండా, హత్యకు ముందు రోజు తన తల్లి అయిన నరసమ్మతో గొడవ పడి..ఆమె చేతి పైన బలంగా కొట్టడంతో, ఆమె చేతి విరిగి నిస్సాయక స్థితిలో పడింది.ఈ నేపథ్యంలో, కుటుంబ సభ్యులు మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
