విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం
లోకల్ గైడ్: ఖమ్మం: వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ – ఖమ్మం (విహే) ఆధ్వర్యంలో
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన టాలీ విత్ జి.ఎస్.టి ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన విహే వ్యవస్థాపకులు దేవకి వాసుదేవ రావు ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాలీ విత్ జి.ఎస్.టి శిక్షణ కోర్సు ఉద్యోగావకాశాలకు మార్గం కల్పించే అనువర్తిత నైపుణ్యంగా (అప్లైడ్ స్కిల్) మారనుంది . మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న ఆర్థిక మరియు ఖాతాదారీ పరిజ్ఞానం నేర్చుకుంటూ విద్యార్థినులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు . "ఇనుప కండరాలు , ఉక్కు నరాలు , వజ్ర సంకల్పం మనసులో ఉన్న వందమంది యువతను నాకు ఇస్తే ఈ ప్రపంచాన్నే మార్చివేస్తా" అన్న స్వామి వివేకానందుని మాటలను స్మరించుతూ ప్రస్తుతం అగ్రదేశమైన అమెరికా పుట్టకముందే భారతదేశంలో నాగరికత ఉద్భవించింది . ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన ఆర్యభట్టుడి జన్మభూమి భారతదేశం . కొన్ని వేల ఏళ్ల క్రితమే ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయ్యాయి . ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయని , ఇవన్నీ ప్రపంచానికి చాటిచెప్పిన వివేకానందుడు స్ఫూర్తిగా విద్యార్థులు ఎదగాలని కోరారు . విద్యార్థినులు శారదామాతను ఆదర్శంగా తీసుకోవాలి . ఆమె జీవితంలో ఉన్న నిరహంకారము , ధైర్యం , సహనం , సేవభావం వంటి లక్షణాలను అలవరచుకోవాలి అని సూచించారు . కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా విహే నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా అభినందనీయం అని అన్నారు . అదేవిధంగా మా కాలేజీ విద్యార్థులకు టాలీ విత్ జి.ఎస్.టి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి , ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు విచ్చేసినందుకు వాసుదేవరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ , విహే ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , కామర్స్ లెక్చలర్ శ్రీలక్ష్మి , రజిని , టాలీ ఫ్యాకల్టీ దుర్గాప్రసాద్ , అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
About The Author
Related Posts
