గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్ :
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు కోరారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరుగకుండా చూదాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మండపాల నిర్వాహకులు ముందే విగ్రహాల కొలతలతో సహా పోలీస్ కు సమాచారం ఇవ్వాలని, ప్రతి శాఖ రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలని, పర్యావరణహిత మట్టి విగ్రహాలు వాడే విధంగా చూడాలని, ఉత్సవాల నిర్వహణ విషయమై ఆర్డీవోలు డిఎస్పీలతో స్థానికంగా
సమావేశాలు నిర్వహించాలని, వినాయక విగ్రహాలను నిమర్జనం చేసే చెరువులలో పూడిక తీసి ముందే చెరువుల్లో నీరు ఉండేలా చూసుకోవాలని, పారిశుధ్యం, తాగునీరు తదితర విషయాలను మున్సిపల్ లో కమిషనర్లు, పంచాయతీ అధికారి చూడాలని, బ్లీచింగ్ పౌడర్ ఏర్పాటు, రహదారులకు చిన్నచిన్న గుంతలు పూడ్చడం వంటివాటిపై దృష్టి సారించాలని, శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించేలా చూడాల్సిందిగా కోరారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ ప్రతి విగ్రహాన్ని పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,మండపాల వద్ద రాత్రి సమయంలో ఒకరు తప్పనిసరిగా ఉండాల్సిన ఉండేలా చూడాలని, పోలీస్ తరఫున గట్టి బందోబస్తుతో పాటు ,పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అంతకుముందు శాంతి కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, ఏ ఏ ఖాన్, నేతిరఘుపతి, సలీం ,నాగం వర్షిత్ రెడ్డి, షౌరయ్య, లక్ష్మయ్య తదితరులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించరేందుకు తమ వంతు సహకారం అందిస్తామని, ఇందుకుగాను నిమజ్జనం చేసే చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలని, మున్సిపాలిటీ ద్వారా శానిటేషన్ కార్యక్రమాలు, చెరువుల వద్ద విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు క్రేన్లు, జనరేటర్, రోడ్ లపై గుంతలు పూడ్చాలని , విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీజ్ ఖాన్ మాట్లాడారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఏసిపి మౌనిక, ఆర్డీవో లు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ,ఇతర అధికారులు ,శాంతి కమిటీ సభ్యులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Tags:
About The Author

Latest News
19 Aug 2025 20:08:16
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్