పాలకుల అధికారుల నిర్లక్ష్యం దారి లేని స్కూలు
సిపిఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య
చోద్యం చూస్తున్న అధికారులు పట్టించుకోని పాలకులు* *బురద గుంటలో నిల బడి నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై జూనియర్ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి ముందు చూస్తే బురద వెనక చూస్తే గొయ్యిలాగా తయారైందని సిపిఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య ఆరోపించారు ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నత పాఠశాల ముందు దారి లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు సమస్య పరిష్కరించాలని బురదలో నిలబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆయన అన్నారు పేరుకు ప్రభుత్వ పాఠశాల కానీ పాఠశాలలోకి వెళ్లాలంటే విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణాతితం అని ఆయన అన్నారు.. గత వారం రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు కనీసం విద్యార్థులు స్కూల్ లోకి వెళ్లాలంటే మార్గం లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు స్కూలుకు రాకుండా వచ్చిన పిల్లలు మూత్రాలు పోసే కాంపౌండ్ గోడ అంచు నుంచి వెళుతూ విద్యార్థులు పడుతున్న గోస చెప్ప లేనిది అని ఆయన అన్నారు అధికారులు ఉపాధ్యాయులు మాత్రం స్కూల్లోకి ఏదో ఒక విధంగా వాహనాల మీద వెళ్తున్న విద్యార్థులు మాత్రం బురదలోకి దిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.. ప్రధానమైన జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు పాఠశాలకు ఏ విధంగా వెళ్తున్నారని ఆయన అన్నారు నిత్యం అధికారులు జిల్లా కేంద్రంలో ఉంటున్న పాఠశాల విద్యాశాఖ అధికారి డీఈవో కనీసం పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవడం శోషనీయమని ఆయన అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ఒకసారి స్కూలు ఆవరణ పరిశీలిస్తే ఎంత దుర్గంధమైన వాసన ఎంత బురద ఉందో ఒక్కసారి కళ్ళకు కనిపిస్తుందని ఆయన అన్నారు.. కానీ ఇవేమీ కళ్ళకు కనిపించని అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.. జిల్లా కేంద్రంలో ప్రధానంగా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆర్డీవో తాసిల్దార్ తదితర ఉన్నత అధికారులు ఉన్న ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి స్కూల్లోకి వెళ్లడానికి కనీసం మొరం లేక సన్న కంకర కొట్టించి విద్యార్థులు స్కూల్ లోకి వెళ్లడానికి మార్గం దారి చూపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేదంటే డీఈఓ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సురేష్ నాయకులు సుభాష్ శివ సుధాకర్ మురళి ప్రేమ్ మహేష్ కుమార్ శివకుమార్ వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు