విధ్వంసానికి గురి అయిన వరంగల్ మహా నగరాన్ని తీర్చిదిద్దండి

ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

విధ్వంసానికి గురి అయిన వరంగల్ మహా నగరాన్ని తీర్చిదిద్దండి

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్

హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ మహా నగరాన్ని వలస పాలకులు నిర్లక్ష్యం చేశారని, ఆజం జాహీ మిల్లు ముసివేతకు గురి అయిందని, వేలాది మంది పేద మహిళలకు ఉపాధి కల్పించిన బీడీల పరిశ్రమ కాలగర్భంలో ముగిసి పోయిందని ప్రజల సంప్రదాయ కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇటుకాల మధుసూదన్ రావు ఎమ్మెస్ రాజలింగం టిఎస్ మూర్తి లాంటి నిస్వార్ధ రాజకీయ నాయకుల చొరవతో ఎన్ఐటి కేఎంసి సంస్థలు వచ్చాయని వలస పాలకులు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోకపోవడం వలననే వరంగల్ జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందనీ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ ఆందోళన చెందారు. బుధవారం రోజు సంగం మండల కేంద్రం స్థానిక  కూడలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ప్రముఖ సామాజిక వేత్త సోమ రామ మూర్తి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా  ప్రధాన కార్యదర్శి ఓదెల రాజన్న పాల్గొన్నారు. స్వరాష్ట్రంలో కూడా గత పాలకులు తమ స్వప్రయోజనాల కొరకు వరంగల్ ను చెక్కలు ముక్కలు చేయడం జరిగిందని తెలంగాణ తెలంగాణ జిల్లాల కొరకు గత 400 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న వరంగల్ జైలును పాలకులు  కూలగొటట్టి 1200 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు గిరువు పెట్టారని ధ్వజమెత్తారు వరంగల్ ఉమ్మడి జిల్లా విధ్వంసాన్ని జీర్ణించుకోలేని ప్రజలు గత పాలకులను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం గట్టిన విషయాన్ని ప్రస్తుత ప్రజాప్రతినిధులు మర్చిపోకూడదని అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, స్థానిక యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లభించినప్పుడే ప్రజల ఆదాయాలు మెరుగైతాయని ప్రాంత అభివృద్ధి జరుగుతుందని అందుకు కావలసిన మామునూరు ఎయిర్పోర్టును, ఇతర మౌలిక సదుపాయాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం  వరంగల్ మహానగరంలోని వివిధ కూడళ్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని వరంగల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఒక 100 58 కోట్ల రూపాయలతో ప్రారంభించిన బొందు వాగు ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపాలన్నారు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని ఐటి ఫార్మసిటికల్ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారానే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను కల్పించడం సాధ్యమవుతుందన్నారు.
వరంగల్ పండ్ల మార్కెట్ కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి నూతన బస్టాండు ప్రాంతాలను రహదారుల విస్తరణతో ఆధునికరించి వరంగల్ మహా నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు సమిష్టి కృషితో సమన్వయంతో  త్వరితగతిన పూర్తిచేయాలని ఉమ్మడి జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను పార్లమెంటు సభ్యులను  శాసనమండలి సభ్యులను ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.
దేశంలో పెద్ద నగరాలు మాత్రమే అభివృద్ధి కేంద్రాలుగా ఎదుగుతున్నాయని  అందుకే హైదరాబాదు మాదిరిగా
హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి చరిత్రాత్మక  వరంగల్ మహా నగరాన్ని అభివృద్ధి చేసి విదేశీ, దేశీయ, ప్రాంతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ మహానగరం ఉత్తర తెలంగాణకే అభివృద్ధి కేంద్రంగా, తలమానికంగా ఎదుగుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ  అన్నారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్