మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు సరికాదు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆసందర్భ ప్రేలాపనలు.
మంచిర్యాల జిల్లా (లోకల్ గైడ్) మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆసత్య ఆరోపణలు చేస్తు పత్రికల్లో మీడియాలో ప్రతిరోజు కనపడాలనే ఆత్రుతతో అబద్దాలను వల్ల వేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని టిపిసిసి ఉపాధ్యక్షులు సత్యనారాయణ,మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదరి తిరుపతి లు అన్నారు.సోమవారం మంచిర్యాల లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.మంచిర్యాల ప్రజలు గత 30ఏళ్లుగా చూడలేని అభివృద్ధిని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు సంవత్సరంన్నర లోపలే చేసి చూపెట్టారు.ఆయన చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని దివాకర్ రావు అసత్య ఆరోపణలు చేస్తు పబ్బం గడుపుకుంటున్నారని,20సంవత్సరాల దివాకర్ రావు పాలనలో మంచిర్యాల 50సంవత్సరాలు వెనక్కి పోవడాన్ని ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు.మంచిర్యాల అభివృద్ధి ఓర్వలేని ఆయన ఇప్పుడు ఒక కొత్త నాటకానికి తెర లేపి అధికారుల మీద నిందలు వేస్తు వారికి ఫోన్లు చేస్తు భయభ్రాంతులకు గురిచేస్తు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు.అధికారులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఎస్ఆర్ ఉంటారని తాటాకు చప్పులకు భయపడే అధికారులు ఎవరూ లేరన్నారు.పని చేసే అధికారులను నువ్వు తాకలేవన్నారు.మీ గత పాలనలో అధికారులు మంచిర్యాలకు రావాలంటే ముడుపులు చెల్లించనదే పోస్టింగులు వచ్చేవి కావు,అందుకే అధికారులు ఇక్కడికి వచ్చిన కూడా కనీసం నీ ఫోనుకు కూడా విలువిచ్చి పనిచేసేవారు కాదు.పైగా ఇక్కడ పనిచేసిన మహిళ కమిషనర్ ఒకరు నువ్వు చేసే అవినీతి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటు వెళ్లిన సందర్భం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు అన్నారు.ఇప్పుడు వచ్చే అధికారులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిలో పాలుపంచుకుంటు మంచిర్యాల దినదినాభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.అటువంటి అధికారులను బెదిరించి,భయపట్టించి అభివృద్ధిని పక్కదోవ పట్టించాలనే దుర్బుద్ధితో ఇలాంటి అసత్య ఆరోపణ చేస్తున్నాడని,అలాంటి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు.తమ ఎమ్మెల్యే దూర దృష్టితో మంచిర్యాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.అందులో భాగంగా మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,ఇండస్ట్రియల్ పార్క్,రాళ్ల వాగు కరకట్ట,మార్కెట్ రోడ్ సుందరీకరణ,మహా ప్రస్థానం పేరిట స్మశాన వాటిక,మహిళా శక్తి భవన్,ఐటిఐ స్కిల్ కళాశాల,నర్సింగ్ కళాశాల,రోడ్ల వెడల్పు కార్యక్రమం దండేపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్,లక్షేట్టిపేట పేటలో ప్రభుత్వ పాఠశాల,కళాశాల ప్రారంభం,ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి నీ కళ్ళకు కనపడట్లేదా అని ప్రశ్నించారు.నువ్వు నీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే వస్తుందని పగటి కలలు కంటు ఉండడమే తప్ప చేసేది ఏమి ఉండదని ఎద్దేవా చేశారు.ప్రజా ప్రభుత్వాన్ని ఇంకా పది సంవత్సరాల వరకు ఈ ప్రజలే కాపాడుకుంటారన్నారు.ఇదేవిధంగా పసలేని ఆరోపణలు చేస్తు పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు సహించరని అన్నారు.మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మీద తిరుగుబాటు మొదలై హైదరాబాద్ వరకు తరిమికొడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్,మాజీ చైర్పర్సన్ వసుంధర,కౌన్సిలర్లు ప్రభాకర్ మజీద్,సదానందం,నగేష్,సత్తమ్మ,పెంట రజిత,గజ్జల హేమలత,ఆర్కల హేమలత తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
