మావోయిస్టు వారోత్సవాలు టూ టౌన్ పోలీస్ విస్తృత తనిఖీలు 

ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు 

మావోయిస్టు వారోత్సవాలు టూ టౌన్ పోలీస్ విస్తృత తనిఖీలు 

   భద్రాద్రి కొత్తగూడెం(లోకల్ గైడ్): చుంచుపల్లి మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ ఆదేశాల మేరకు డీఎస్పీ రెహమాన్ సూచనలతో 2 టౌన్ సిఐ ప్రతాప్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీసులు నేషనల్ హైవే రుద్రంపూర్ పార్క్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. మావోయిస్టు వారోత్సవాలు జూలై 28 సోమవారం నుండి ఆగస్టు 3 వరకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించరు. ఆర్టీసీ బస్సులు తనిఖీలు చేస్తూ బస్సులోని ప్రయాణికులను ఆధార్ కార్డులు చూస్తూ వారు ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు ప్రయాణం చేస్తున్నారో విచారిస్తూ అనుమానం ఉన్న వ్యక్తులను పూర్తిగా వారి సమాచారాన్ని సేకరించి పంపించడం జరుగుతుంది. టూ టౌన్ సిఐ ప్రతాప్ ప్రతి బస్సును కారు ఆటో లారీలను స్వయంగా దగ్గరుండి తనిఖీలు నిర్వహిస్తూ వారి సమాచారాన్ని సేకరించి సరన పత్రాలు చూపించిన వారిని పంపిస్తూ పలువురికి తగిన సూచనలు టూ టౌన్ సీఐ ప్రతాప్ చేశారు. ఈ తనిఖీలలో టూ టౌన్ ఎస్ఐలు కిశోర్ కుమార్, ఎం .మనీషా ఏఎస్ఐలు జాన్సీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, బుచ్చి రాములు,వీరస్వామి,గఫూర్ ,వజ్జా వెంకటేశ్వర్లు,ఓఎస్డి స్పెషల్ పార్టీ టూ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం
హస్త నక్షత్ర ప్రభావంతో జూలై 30 బుధవారం కొన్ని రాశులకు అదృష్టం వాలింది. కొన్ని రాశులవారికి ఆదాయం పెరుగుతుంది, శుభవార్తలు, ప్రయాణాలు, ఉద్యోగ పురోగతులు కనిపిస్తుండగా... మరికొందరికి...
చరిత్ర సృష్టించిన టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ
జగన్ ఇంటికెళ్తే కండువా......
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.
ప్రజల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.
వివాదాస్పదంగా మారిన పోడు భూముల సమస్య