ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్  

ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా (లోకల్ గైడ్); ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 119 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ భూ సమస్య లు, భూ సర్వే , పెన్షన్ లకు సంబందించి ఫిర్యాదు లు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసు చంద్ర,డి ఆర్ డి ఓ శ్రీనివాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం
హస్త నక్షత్ర ప్రభావంతో జూలై 30 బుధవారం కొన్ని రాశులకు అదృష్టం వాలింది. కొన్ని రాశులవారికి ఆదాయం పెరుగుతుంది, శుభవార్తలు, ప్రయాణాలు, ఉద్యోగ పురోగతులు కనిపిస్తుండగా... మరికొందరికి...
చరిత్ర సృష్టించిన టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ
జగన్ ఇంటికెళ్తే కండువా......
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.
ప్రజల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.
వివాదాస్పదంగా మారిన పోడు భూముల సమస్య