హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి04 లోకల్ గైడ్
రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్.బి.టి.ఈ.టి) సెక్రెటరీ ఎ. పుల్లయ్య ని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా 29 మార్చి 2026 (ఆదివారం) రోజున వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 70 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరుకావాలని కోరుతూ శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు రాష్ట్ర సాంకేతిక విద్యా అభివృద్ధికి ముఖ్య భూమిక వహిస్తున్నాయని, పూర్వ విద్యార్థుల సమ్మేళనం వంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నందుకు వరంగల్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘానికి అభినందనలు తెలిపారు. ఎస్.బి.టి.ఈ.టి సెక్రెటరీని కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్, నాయకులు ముషం శ్రీనివాస్, తాజుద్దీన్, శ్రీనివాస్ మహేంద్ర, చింతం గిరివర్మ, భూక్యా మధు, పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిని ఇ.వి. కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.