రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు
చర్ల : లోకల్ గైడ్ :
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావు
రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి నిరసన తెలియజేసిన అనంతరం మండల తహసీల్దార్ శ్రీనివాసరావుకి సమస్యలపై వినతిపత్రం అందజేసారు. తహసీల్దార్ సమస్యల వినతిపత్రంను కలెక్టర్ కి పంపిస్తాను అని తెలియజేసారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలమంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజా సేవ చేసి, వచ్చిన జీవితంతో కుటుంబాని నడుపుకుంటు, కొంత ప్రభుత్వం దగ్గర దాచుకుంటు న్యాయ పరంగా ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తారని, వారి ఆశ నిరాశ అయిందన్నారు.
పెన్షన్ బెనిఫిట్స్ రాక రాష్ట్రం మానసిక ఒత్తిడికి గుండె పోటుతో, ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు 72 మంది చనిపోయారని, ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సి ఇస్తామని, డీఏ లు ఇస్తామని, మాయ మాటలకు ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, గెలిచిన తర్వాత హమీలు మర్చిపోయరని అన్నారు. ఇప్పుటికైనా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, వారి చావుల మరణమృదంగాన్ని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు డీ సర్వేశ్వరరావు, పీ నరసింహరావు, బీవీఎస్ఎల్ నరసింహరావు, వీ నాగభూషణం, ఆడెపు ముత్యాలరావు, ఏ నాగేశ్వర్రావు, జీ ఎస్ రాజకుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజీజ్, కాకి అనిల్, పంజా రాజు, గోరింట్ల వెంకటేశ్వరావు, యూత్ నాయకులు బొజ్జ సాయిప్రణీత్, గాధం శెట్టి కిషోర్ కుమార్, పాసిగంటి సంతోష్, పీహెచ్ వంశీ, మహిళ నాయకురాలు బేతం చర్ల నర్సవేణి, అంకాల శ్రీనివాసరావు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
