బసవతారక నగర్ పేదలకు ఇండ్లు కట్టించాలి

బసవతారక నగర్ పేదలకు ఇండ్లు కట్టించాలి

- బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్

-గుడిసెవాసులను పరామర్శించిన సీపీఎం నాయకులు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి):  బసవతారక నగర్ గుడిసెవాసులకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. గచ్చిబౌలిలోని బసవతారక నగర్ గుడిసె వాసులను రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి చల్లా శోభన్, జిల్లా, మండల నాయకులు మంగళవారం పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలను ఇబ్బందులు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ పెద్దలు గుడిసెవాసులను ఖాళీ చేయించే కుట్రలకు పాల్పడితే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన ఇప్పటి సిఎం రేవంత్ రెడ్డి బసవతారక నగర్ ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజలను మభ్యపెడుతూ డబ్బులకు లొంగని వ్యక్తులపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే కోర్టులో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్న ఇక్కడి పేదలను ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని బసవతారక్ నగర్ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులను పరామర్శించిన వారిలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, సిపిఎం నాయకులు శోభన్, కృష్ణ, అతిక్, జార్జ్ కృప, అనిల్, శ్రీనివాస్, జంగయ్య, శివుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి... ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి...
పెద్దపల్లి ఓదెల జూలై,31 (లోకల్ గైడ్); తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా...
ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.
విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్... 
పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం
ప్రమాదం తప్పిన  ఆర్టీసీ బస్సు 
పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు
ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం