విద్యార్థినిలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.
మంచిర్యాల జిల్లా (లోకల్ గైడ్)విద్యార్థినులు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ఉండాలని,ఎవరైనా వేధింపులకు గురి అయినట్లయితే వెంటనే కాగజనగర్ షీ టీం నెంబర్ 8712670565 నెంబర్ కి సమాచారం అందించాలని కొమరం వస్తావా జిల్లా సిటీ ఇంచార్జి ఎఎస్ఐ సునీత తెలిపారు.కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పి కాంతిలాల్ పాటిల్,ఆసిఫాబాద్ ఎఎస్పి చిత్తరంజన్ ల ఆదేశాల మేరకు,పెంచికల్ పేట్ మండలం చెడ్వాయి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీటీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీటీం ఇంచార్జి మాట్లాడుతు విద్యార్థినులకు భద్రతా చట్టాలు,ఆపద సమయంలో ఎలా స్పందించాలి,డయల్ 100,సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు,ఈవ్ టీసింగ్,సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ టి రమేష్ బాబు,ఉపాధ్యాయులు, షీటీం సిబ్బంది రమాదేవి,స్వప్న,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
