ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
By Ram Reddy
On
2004- 2006 విద్యా సంవత్సరంలో విశ్వ వికాస్ జూనియర్ కళాశాలలో బైపీసీ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
(లోకల్ గైడ్ జడ్చర్ల)
జడ్చర్ల పట్టణంలోని విశ్వ వికాస్ జూనియర్ కళాశాలలో 2004 - 2006 సంవత్సరంలో బైపీసీ చదివిన పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు చదివిన విద్యార్థులు నేడు విద్యారంగం, సాంకేతిక రంగం, వైద్యం,రాజకీయాలు, తదితర విభాగాల్లో స్థిరపడ్డారు.20 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకుని అపూర్వమైన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సమ్మేళనంలో 40 మంది విద్యార్థులు మరియు ఆనాడు బోధన చేసిన ఉపన్యాసకులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థులు కొందరు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, గత జ్ఞాపకాలను పునఃస్మరించుకున్నారుఈ సందర్భంగా కళాశాలలో ఆనాడు బోధించిన ఉపన్యాసకులు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. విద్యార్థులతో సంతోషంగా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ జీవిత ప్రయాణాలు, విజయాలు, మరియు కళాశాలలో నేర్చుకున్న చదువు వల్ల వచ్చిన మార్పును నేడు గుర్తు చేసుకుంటూ సంతోషపడ్డారూ. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నృత్యం, చిన్న చిన్న ఆటలతో సందడి చెలరేగింది. చివరగా, పూర్వ విద్యార్థులు ప్రతిసారీ ఇలా సమ్మేళన కార్యక్రమం నిర్ణయించుకోవాలని నిర్ణయించుకున్నరూ. ఈ కార్యక్రమంలో నాడు విద్యాబోధన చేసిన ఉపన్యాసకులు యాదగిరి, రాజేంద్ర సాహెబ్, చంద్రశేఖర్ రెడ్డి,ఐసాక్, సురేష్ రామకృష్ణ,శేఖర్, సుభాషిని జానకిరాములు గౌడ్ మరియు పూర్వ విద్యార్థులు రాధాకృష్ణ, శివకుమార్, రవికుమార్, సుభాష్ చంద్రబోస్, భరత్, రాఘవేందర్, రవి కిషోర్, వెంకటేష్, జగన్, సుజాత, చందన, రమ్య, వీణ, ప్రియాంక సుస్మిత, అనూష మొదలగు వారు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts

Latest News
14 Jul 2025 11:42:17
2004- 2006 విద్యా సంవత్సరంలో విశ్వ వికాస్ జూనియర్ కళాశాలలో బైపీసీ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం