*అంబరాన్నంటిన ఊర పండుగ..

*అంబరాన్నంటిన ఊర పండుగ..

 దేవతామూర్తుల డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు...

అడుగడుగున భక్తుల మొక్కులు...

పోలీస్ బందోబస్తు...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాల కాలంగా వస్తున్న ఊరపండగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొత్త దేవత మూర్తులను ఖిల్లాలోనే ప్రతిష్టించి సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలుమైసమ్మ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మామిడి కర్రలతో తయారు చేసిన 12 దేవత విగ్రహాలను అర్థరాత్రే వాటిని ఖిల్లా వద్ద ప్రతిష్టించారు. మూడురోజుల ముందే ఆనవాయితీ ప్రకారం బాసర గోదావరి నుంచి పవిత్ర జలాలు తెచ్చి ఖిల్లా వద్ద గ్రామదేవతలు జలాభిషేకం చేయడంతోనే ఊర పండగ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈసారి ఊరపండగ సంబరాలు నగరం నాలుగు వైపులా అంబరాన్ని తాకాయి. ఖిల్లా రఘునాథ ఆలయం దగ్గర నుంచి దేవత మూర్తిలను ఊరేగింపుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే ఘట్టంకు భారీఎత్తున భక్తులు తరలి వచ్చారు. కొత్త దేవత మూర్తులను నగరంలోని ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు తరలించారు. దేవత మూర్తుల ఊరేగింపుకు ఎదురెళ్లి కోళ్ల ను ఎగరేశారు. ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మీదే మేకలు.. మేకలను గొర్రెలను బలి ఇచ్చారు. ఈ సారి వర్షాలు పుష్కలంగా పదాలని ఎలాంటి అరిష్టాలు అనారోగ్యాలు రాకుండా ఉండాలని అందుకు 12 గ్రామదేవతలకు ఓకె రోజు పూజలు చేయడం జిల్లాకేంద్రంలో దశాబ్దాల తరబడిగా వస్తుంది.

ఈ ఊర పండగ సందర్భంగా నగరంలోనీ పలువురు నాయకులు, నేతలు భారీఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం కోసం వచ్చిన ఎమ్మెల్యే ధన్సాల్ సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నాయకులు కేశవేణు, నరాల రత్నాకర్ లతో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు దర్శించుకున్నారు. ఖేలా నుంచి దేవత మూర్తుల ఊరేగింపుగా

కొత్త దేవత మూర్తులను ఖిల్లాలోనే ప్రతిష్టించారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలుమైసమ్మ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో తొట్టెల కింద భారీ భక్త జనం లైన్ లో కూర్చున్నారు. వీరి మీద నుంచి తొట్టెలు తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తుంది.డప్పులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల, మహిళల పూనకాలతో దేవతా మూర్తుల ఊరేగింపు. ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె ను తేలుమైసమ్మ గద్దె నుంచి మొదలై గాజుల్పేట్ చౌరస్తా మీదుగా పెద్దబజార్ చౌరస్తా వరకు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాడాలమ్మ, నల్లపోచమ్మ అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, పులి, రాట్నం, ఆసు. తొట్టెలతో ఊరేగింపు దుబ్బవైపు వెళ్తుంది. రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయకనగర్ ఐదు చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ, మహా లక్ష్మమ్మలతో వెళ్తుంది. సరిని నాలుగు గుల్లలుగా విభజిస్తారు. ఒక గుల్ల దుబ్జవైపు, రెండవది వినాయక్ నగర్, మూడోది ఎల్లమ్మగుట్ట, నాల్గోది కంఠేశ్వర్ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళతారు.

Tags:

About The Author

Related Posts

Latest News

*అంబరాన్నంటిన ఊర పండుగ.. *అంబరాన్నంటిన ఊర పండుగ..
  దేవతామూర్తుల డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు... అడుగడుగున భక్తుల మొక్కులు... పోలీస్ బందోబస్తు... నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
విక్రయించిన పసికందును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చిన నిజామాబాద్ పోలీసులు...
ఊర పండగ శోభాయాత్ర  నిర్వహించే రూట్ మ్యాప్ ను
మరికొన్ని గంటల్లో ఇందూర్ లో ఘనంగా ఊర పండుగ వేడుకలు...
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన BJYM నాయకులు...
పోలీసు కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించిన జిల్లా ఎస్పీ
నేత్రదానం పై అవగాహన పెంచుకోవాలి.