ఊర పండగ శోభాయాత్ర  నిర్వహించే రూట్ మ్యాప్ ను

ఊర పండగ శోభాయాత్ర  నిర్వహించే రూట్ మ్యాప్ ను

పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య...

* నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ పట్టణంలో నిర్వహించే ఊర పండగ శోభయాత్రను పర్యవేక్షించారు.. నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యరూట్ మ్యాప్ కార్యక్రమం  రఘునాథ ఆలయం ఖిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై వివేకానంద చౌరస్తా,  లక్ష్మీ మెడికల్, గాజుల్ పెట్ , పెద్ద బజార్, గోల్ హనుమాన్ , పూలాంగ్ చౌరస్తా , వినాయక నగర్  ఆర్యా నగర్, దుబ్బ తదితర ప్రాంతాలను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు మరియు , పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని , ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం , నగర సీఐ శ్రీ శ్రీనివాసరాజ్ , ఊర పండగకు సంబంధించినటువంటి ముఖ్య సభ్యులు  రామ్మర్తి గంగారాం , గాండ్ల లింగం , రాజేందర్ ధుoపేట , విజయ గజ్బింకర్ మరియు సంబంధిత అధికారులు  పాల్గొన్నారు..

Tags:

About The Author

Related Posts

Latest News