విక్రయించిన పసికందును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చిన నిజామాబాద్ పోలీసులు...

విక్రయించిన పసికందును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చిన నిజామాబాద్ పోలీసులు...

పలువురిపై కేసు నమోదు... వన్ టౌన్ ఎస్ హెచ్ వో బి. రఘుపతి...

 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) విక్రయించిన నవజాత శిశువును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చారు నిజామాబాద్ ప్రత్యేక పోలీస్ బృందం..శిశువు ను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు... తల్లిదండ్రులతో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు...కన్న తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడబిడ్డను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే...క్రయ విక్రయాల మధ్య ఒప్పందం లో తేడాలు రావడంతో విషయం బయటకు రావడంతో సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన అమానుష ఘటనపై  నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ లో  పసికందు తల్లిదండ్రులైన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్​ కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులపై మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు వేగవంతం చేశారు.. ప్రత్యేక పోలీస్ బృందం ద్వారా సోలాపూర్ నుండి పసికందును సోలాపూర్ తెప్పించి బాలల సంరక్షణ గృహానికి తరలించారు.. అనంతరం తల్లిదండ్రులతో పాటు దీనికి సహకరించిన కొనుగోలు చేసిన వారందరిపై కేసులు నమోదు చేశారు..

Tags:

About The Author

Related Posts

Latest News