ఆపదలో ఆప్తుడిగా వస్తా అందరికీ అండగా ఉంటా పట్టణాభివృద్ధి కోసం పని చేయాలని
------పాత అలవాట్లు పక్కకెట్టి పని చేయండి
By Ram Reddy
On

-------100 రోజుల అవగాహన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి లోకల్ గైడ్,
వనపర్తి మున్సిపాలిటీలో పనిచేసే అధికారులు సిబ్బంది అందరూ వారి వారి పాతా అలవాట్లను పక్కకు పెట్టి పట్టణాభివృద్ధి కోసం పని చేయాలని మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న అండగా ఉంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.బుధవారం వనపర్తి మునిసిపాలిటీలో నిర్వహించిన 100 రోజుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు వార్డు అధికారులుగా,మెప్మా ఆర్పీలుగా,జవాన్లుగా,మీరు నిరంతరం వనపర్తి పట్టణ ప్రజలకు అందించే సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వారిని అభినందించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి వనపర్తి జిల్లా కేంద్రం పై ఉందని త్వరితగతిన అభివృద్ధి చెందే వనపర్తి పట్టణాభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలన్నారు.గతంలో మీరు ఎలా పనిచేశారన్నది పక్కకు పెడితే నేటి నుంచి నిబద్ధతతో పనిచేయాలని, విధి నిర్వహణలో మీ దృష్టికి వచ్చే పొరపాట్లను నివృత్తి చేస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఓటర్ లిస్ట్ పై ప్రత్యేక దృష్టి సారించి నిజమైన పట్టణ ఓటర్లను గుర్తించి,డబల్ ఎంట్రీలు ఉన్న వాటిని తొలగించాలని ఆయన సూచించారు. పని విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News

14 Jul 2025 11:42:17
2004- 2006 విద్యా సంవత్సరంలో విశ్వ వికాస్ జూనియర్ కళాశాలలో బైపీసీ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం