అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం
కంటోన్మెంట్ నియోజక వర్గంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
మేడ్చల్ మల్కాజిగిరి (లోకల్ గైడ్): అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభా కర్ అన్నారు. రేషన్ కార్డులు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. శుక్రవా రం లీప్యాలెస్ లో
కంటోన్మెంట్ నియోజక వర్గానికి చెందిన లబ్ధిదారు లకు ఆయన, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన
ప్రజా పాలన ప్రభుత్వం, అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుందన్నారు. గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. వారికి ఉచితంగా సన్న బియ్యం కూడా పంపిణీ జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పొందుతున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో కొత్తగా పెళ్లి అయిన వారు రేషన్ కార్డులు పొందే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. కొత్తగా ఇంట్లో పుట్టిన పిల్లలకు కూడా రేషన్ కార్డులలో పేర్లు ఎక్కించలేని పరిస్థితి ఉండేదన్నారు.గత నెలల్లో రైతు భరోసా పండగ..ఇందిరమ్మ ఇళ్ల పండగ జరిగిందన్నారు. శ్రావణ మాసంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తామన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డులు రాని వారు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ.. ఎప్పుడు కావాల నుకున్నా అప్పుడు పేర్లు యాడ్ చేసుకోవచ్చునని తెలిపారు. గత ప్రభుత్వంలో హుజురాబాద్ ,నాగార్జున సాగర్ లాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రేషన్ కార్డులు వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో
హైదరాబాద్ నగరంలో కొత్తగా 55 వేల రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. మొన్నటి దాకా దొడ్డు బియ్యం తినలేక తిరిగి ఆ బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు.ఇప్పుడు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ధనవంతులకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యం పేదలకు కూడా తినాలనే ఉద్ధేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు.
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.
కంటోన్మెంట్ లో ఉపాధి ఉంటే కల్లూరు లో ఇల్లు ఉన్నాయి అది ఎలా సాధ్యం..? ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ ఇల్లు ఉండాలనేది మా పాలసీ అన్నారు.ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 200 కోట్ల మంది 6800 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారని మంత్రి చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి కుటుంబానికి ఇస్తున్నామని
తెలిపారు. ఇప్పుడు కంటోన్మెంట్ నియోజక వర్గంలో 1150 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. 4220 మంది పేర్లు కొత్త రేషన్ కార్డులో నమోదు అయ్యా యని తెలిపారు.కంటోన్మెంట్ నియోజకవర్గంలో మొత్తం రేషన్ కార్డులు 33,971 నుండి 35,121 కి పెరిగాయన్నారు. లబ్ధిదారుల సంఖ్య 1 లక్ష్య 1,162 నుండి 1, 19,080 కి పెరిగిందన్నారు.
ఇంకా 4664 అప్లికేషన్ లు వెరిఫికేషన్ నడుస్తుందని,702 సభ్యుల సంఖ్య విచారణ చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో కొత్తగా 55,378 రేషన్ కార్డులు 3,79,249 రేషన్ కార్డులో లబ్ధిదారుల సంఖ్య పెరిగిందన్నారు. జిల్లాలో 6,39,451 నుండి 6,94,829 లక్షలకు రేషన్ కార్డులు పెరిగాయని చెప్పారు. ఇంకో లక్ష రేషన్ కార్డుల వెరిఫికేషన్ నడుస్తుందని,అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ
కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక, కలెక్టర్ దాసరి హరిచందన, కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ నర్మదా, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు
About The Author
