దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.

దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.

 నల్లగొండ (లోకల్ గైడ్ ); తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నాటి భూస్వాములను నిజాం రజాకారులను తరిమిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ అని అన్నారు.శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో కాచం కృష్ణమూర్తి 19వ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ ప్రజల కోసం అనేక ఆటుపోట్లు నిర్బంధాలను అధిగమించి పీడిత ప్రజల పక్షాన నిలిచి మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సముచిత పాత్రను పోషించారు అన్నారు, విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మెలకువగా చాకచక్యంగా వ్యవహరించడంలో బహు నేర్పరి. ఐలమ్మ భూ పోరాటం, దొడ్డి కొమురయ్య నేలకొరిగిన ఉదాంతం నుంచి కృష్ణమూర్తి గారి కార్యాచరణ ముమ్మురమైందని వారన్నారు. బాంచన్ దొర  కాల్మొక్త  అనే బక్కచిక్కిన పేదలతో బంధుకులు పట్టించి దొరలను, జాగిందారలను తరిమి కొట్టి దున్నేవాడికి భూమిని పంచి వేలాది గ్రామాల ప్రజలను విముక్తి చేసి, కూలి పోరాటాలకు నాయకత్వం వహించి గ్రామీణ పేదలకు వ్యవసాయ కూలీలకు అండగా నిలిచారని వారన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తుందని దేశాన్ని కార్పోరేట్ శక్తులకు దారదత్వం చేస్తుందన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ  గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నినీరుగారుస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలివ్వాలన్నారు. నేటితరనికి కృష్ణమూర్తి జీవితం ఆదర్శమని. వారు నడిచిన పోర బాటలో ప్రజలను చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్య స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం, మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య ,పట్టణ ఉపాధ్యక్షులు తెలకపల్లి శ్రీను, విజయ్ మధు శంకర్ రాములు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం