భేటీ బచావో ....! భేటీ పడావో ....!!

భేటీ బచావో ....! భేటీ పడావో ....!!

నిజామాబాదు (లోకల్ గైడ్); నిజామాబాద్ డిస్టిక్ రిసోర్స్ సెంటర్ లో  మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం "బేటి బచావో బేటి పడావో " కార్యక్రమం నిర్వహించారు . ఇందులో  భాగంగా డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్ట్ మరియు డిచ్ పల్లి ప్రాజెక్ట్ నందుగల గవర్నమెంట్ పాఠశాలలు మాణిక్ బండార్,బోర్గం కె, చిన్నాపూర్, మాక్లూర్, మామిడిపల్లి, దుబ్బ, చంద్రశేఖర్ కాలనీ లోగల గవర్నమెంట్ హై స్కూల్ లో గల ఎనిమిదవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి బాలికలకు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్  ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఎస్ కె రసూల్ బీ విచ్చేసి బేటి బచావో బేటి పడావో కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఆడపిల్లల ప్రాముఖ్యత, లింగ వివక్షత, ఆల్ టోల్ ఫ్రీ నెంబర్స్, మరియు లైఫ్ లో ఎదురయ్యే సమస్యలను  ఎలా ఎదుర్కోవాలి వివరించారు . సరైన టైంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి,అనే విషయాల పైన పిల్లలకి అవగాహన కల్పించారు . డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ నుండి విచ్చేసినటువంటి శ్రీహరి  కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ , మహిపాల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పిల్లలకి చైల్డ్ రైట్స్, స్కిల్స్ కెరీర్ గైడెన్స్, పబ్లిక్ స్పీకింగ్, కెపాసిటీ బిల్డింగ్, జెండర్ ఈ క్వాలిటీ, పోక్సో ఆక్ట్, పబ్లిక్ స్పీకింగ్,పర్సనాలిటీ డెవలప్మెంట్, బై స్టాండర్డ్ ఇంటర్వెన్షన్, ఓరియంటేషన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్,కెరీర్ గైడ్లైన్స్ గోల్ సెట్టింగ్స్, సాఫ్ట్ స్కిల్స్,ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్,వాటిపైన అవగాహన శిక్షణ ఇచ్చారు . ఈ కార్యక్రమానికి సిడిపిఓ సౌందర్య , జ్యోతి , సూపర్వైజర్ శ్రీ ప్రియ , వరలక్ష్మి , మమత , డాటా ప్రో డిస్టిక్ కో ఆర్డినేటర్ లహరి మరియు ఆనంద్ ,ఎక్సైజ్ ఎస్సై రవి , స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, డిహెచ్ డబ్ల్యు టీం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, జెండర్ స్పెషలిస్ట్ సౌమ్య, కవిత, ఆర్ధిక అక్షరాస్యత నిపుణురాలు పుష్ప, అకౌంటెంట్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం