పద్బాంధవులుగా 108 సిబ్బంది.

- హర్షం వ్యక్తం చేస్తున్న సామాన్యులు. 

పద్బాంధవులుగా 108 సిబ్బంది.

లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా మారింది.ఈ నెంబర్కు కాల్ చేస్తే రోడ్డు ప్రమాదం,హఠాత్తు గుండెపోటు,ప్రసవం వంటి పరిస్థితులలో బాధితుల దగ్గరకు అంబులెన్స్ వెంటనే వస్తుంది. అనంతరం అంబులెన్స్ లో ఉన్న సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించే క్రమంలో, ప్రథమ చికిత్స చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతూ మెరుగైన సేవలు అందిస్తున్నారు.అత్యవసర సమయంలో మన ప్రాణాలను కాపాడటంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.కాబట్టి అంబులెన్స్ 108 సిబ్బందిని ఆపద్బాంధవులుగా పలువురు కొనియాడుతున్నారు.ప్రజలకు ఎక్కడ ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న మనందరికీ మొదటగా గుర్తుకొచ్చేది 108.సంఘటనను చూసిన ప్రతి ఒక్కరు మొదటగా 108 కు కాల్ చేయండి అని గుర్తు చేస్తుంటారు.ఎందుకంటే సమయానికి చేతిలో డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ వాహనాలలో తీసుకెళ్లడం అసాధ్యం.అదే అంబులెన్స్ లో తీసుకెళ్తే రూపాయి ఖర్చు లేకుండా సురక్షితమైన ప్రయాణంతో పాటు ప్రథమ చికిత్స చేస్తూ గమ్యస్థానానికి చేరవేస్తారు.ఇందుకు మరొక ముఖ్య కారణం....అత్యవసర సమయాల్లో చికిత్స అందించడంతో పాటు క్షతగాత్రులు,రోగులను ఆసుపత్రులకు తరలిస్తారు. ప్రస్తుతం మన దేశంలో 16 రాష్ట్రాల్లో అంబులెన్స్ సేవలు అందించడం గమనార్హం.

అత్యవసర సేవలు.
108 అంబులెన్స్ వాహనంలో అత్యవసర సేవలు అందించడానికి....శిక్షణ పొందిన ఈఎంటి,పైలెట్ అందుబాటులో ఉంటారు.అవసరమైన సమయంలో రోగులను, క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రిలో చేర్చడంతో పాటు ఆసుపత్రికి వెళ్లే గ్రామంలో ప్రథమ చికిత్స చేసి అనేకమంది ప్రాణాలను కాపాడుతున్నారని పేద ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గుండె నొప్పి వస్తే ఏఈడి పరికరం దానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచారు.అదేవిధంగా ఆక్సిజన్ పరికరాలు,ఆక్షి మీటర్, పురుగుల మందు తాగితే కక్కించే యంత్రం వాహనంలో అందుబాటులో ఉంటాయని అంబులెన్స్ సిబ్బంది స్పష్టం చేశారు.ఆస్పత్రికి తరలించే క్రమంలో గర్భిణులకు సుఖ ప్రసవాలు చేసిన ఘటనలో చాలా చూశామని పలువురు 108 సిబ్బంది సేవలను అభినందిస్తున్నారు.

జిల్లాలో 15 నెలలుగా అందిస్తున్న సేవల వివరాలు.
మెడికల్ కేసులు -20407.

ప్రెగ్నెన్సీ కేసులు -5424.

ఆర్టిఏ కేసులు -1872.

గుండెపోటు కేసులు -771.

బ్రీతింగ్ కేసులు -983.

ఈ విధంగా అన్ని కేసులకు సంబంధించి అందించిన సేవలు 29457.

నిత్యం తనిఖీ.
జిల్లాలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ వాహనాలను నిత్యం క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ ఉంటాం. అత్యవసర సేవలు అందించేలా మందులు పరికరాలు అందుబాటులో ఉంచాము. సమాచారం వచ్చిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని... ఆస్పత్రులకు తరలించే లోపు వాహనంలోనే ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే తమ ప్రథమ విధి. 

 

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం