విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
నాగర్ కర్నూల్ జిల్లా (లోకల్ గైడ్); శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం నందు వైద్య ఆరోగ్యశాఖ మరియు ఐసిడిఎస్ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు విజయవంతమైనట్లు హెల్త్ అసిస్టెంట్ కూన గోవర్ధన్ తెలియజేశారు
ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక మాట్లాడుతూ ప్రపంచ బెస్ట్ ఫీడింగ్ వారము ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు నుండి 7వ తారీకు వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు
ఏఎన్ఎం గజవర్ధనమ్మ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తల్లిపాలు శిశు ఆరోగ్యము మరియు జీవన రక్షణకు అత్యంత ప్రభావంతమైన మార్గాలలో ఒకటి అని తల్లిపాల వల్ల పిల్లలకు నీళ్ల విరోచనాలు నిమోనియా లాంటి సాధారణ వ్యాధుల నుండి రక్షించే ప్రతిరక్షకాలను కలిగి ఉంటాయి అని అన్నారు తల్లిపాలతో పెరిగే పిల్లల మేధస్సు పరీక్షల్లో మెరుగ్గా ఉంటుంది అధిక బరువు మధుమేహం (షుగర్) వంటి సమస్యలకు తక్కువగా శిశువులలోనవుతారు ప్రతి తల్లి బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు బ్రెస్ట్ ఫీడింగ్ తప్పనిసరిగా ఇవ్వాలి అని సూచించారు రెండు సంవత్సరాల వరకు తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లులకు గర్భాశయ మరియు అండాశయ తో పాటు బెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయని తెలియజేశారు
మనదేశంలో 88.6% వరకు కాన్పులు (డెలివరీస్) ఆస్పత్రిలోనే జరుగుతున్నాయి కానీ ఒక గంటలోపు తల్లిపాలు (ముర్రుపాలు) 41.8 శాతం మాత్రమే పట్టిస్తున్నారు ఒక గంటలోపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో ఆశా వర్కర్లు పార్వతి జయమ్మ షమీం అంగన్వాడి సెక్టార్ లోని పాలెం గుడ్ల నర్వ కారకొండ వసంతాపూర్ వెంకటాపూర్ ఖానాపూర్ నంది వడ్డే మాన్ గ్రామాల అంగన్వాడి టీచర్లు గ్రామంలోని బాలింతలు మరియు గర్భవతులు పాల్గొన్నారు
About The Author
Related Posts
