సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.
By Ram Reddy
On
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శాఖీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దొంతి రవిశంకర్ ముదిరాజ్.
లోకల్ గైడ్ శేరిలింగంపల్లి:ఈ సందర్భంగా దొంతి రవిశంకర్ మాట్లాడుతూ – “సీతక్క ప్రజలతో మమేకమై నిరంతరం వారి కోసం పోరాడుతున్న శక్తివంతమైన నాయకురాలు. ఆమె జీవిత పోరాటం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ఆమె చేపడుతున్న కార్యాచరణలు ప్రశంసనీయం” అని అన్నారు.సామాజిక న్యాయం కోసం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మరియు పల్లె అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తోందని, ఆమె నాయకత్వం తెలంగాణకు అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. జన్మదినం సందర్భంగా సీతక్క ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాజిక కార్యకర్తలతో కలిసి దొంతి రవిశంకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Tags:
About The Author
Related Posts

Latest News
09 Jul 2025 20:08:11
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శాఖీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దొంతి...