రీయింబర్స్మెంట్ ఫీజులను విడుదల చేయాలి
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు...
పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్.మహాబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ తెలంగాణ
మహాబూబాబాద్ జిల్లాలోరాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ ఫీజు స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని మహబూబాబాద్ జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో పిడిఎస్యు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు బకాయి విషయంలో స్పందించకుండా విద్యార్థులకు మొండిచేయి చూపిస్తుందని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ అన్నారు. గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఫీజును, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవా, జీవన్, శేశు కుమార్, హోమ్ జి, ఉదయ్, బాలు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
