విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇప్పించాలి.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
నల్లగొండ ప్రతినిధి. లోకల్ గైడ్.
నల్గొండ మండలం, ముషంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కి ఇబ్బంది కలగకుండా తక్షణమే తాగునీటి వాటర్ ట్యాంకు కు కనెక్షన్ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
బుధవారం ఆమె ముషంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో తాగునీటికి ఇబ్బంది ఉందని తెలిసి కలెక్టర్ తాగునీటి సమస్యపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి హెడ్మాస్టర్ సైదిరెడ్డి తగు నీటి సమస్యను జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ గతంలో ఉన్న మోటర్ పనిచేయడం లేదని, వేసవి సెలవుల్లో వాటర్ ట్యాప్ లు తీసుకెళ్లిపోయారని తెలుపగా, తక్షణమే మోటారుతో వాటర్ ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొమ్మిది ,పదవ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి మాథెమాటిక్స్ లో వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు.
About The Author
Related Posts
