కిష్టారం పోలేపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలి 

కిష్టారం పోలేపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలి 

గ్రామస్తులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి వినతి

మహబూబ్ నగర్ జిల్లా ఆగస్టు 18(లోకల్ గైడ్):

జడ్చర్ల మండల పరిధిలో  కిష్టారం, పోలేపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలని సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి బ్రిడ్జి మంజూరు కొరకు  పోలేపల్లి, కిష్టారం, ఖానాపూర్ గ్రామాల ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. పోలేపల్లి చెరువు  ప్రతి సంవత్సరం అలుగు పారడంతో  రాకపోకలు,  పోలేపల్లి కిష్టారం ఖానాపూర్ గ్రామాల విద్యార్థులకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. యువకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా బ్రిడ్జి మంజూరు చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సింగ్ దాస్ శ్రీనివాసులు , మొదల యాదయ్య, పాలెం రాజేంద్ర గౌడ్, పిట్టల వెంకటేష్,పిట్టల  సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News