నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డు బీసీ కాలనీలో

పర్యటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డు బీసీ కాలనీలో

 లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
బీసీ కాలనీ లో పర్యటిస్తు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ బీసీ కాలనీ అంతా బురదమయంగా మారిన దుస్థితి
జిల్లా కేంద్రం కు కూతవేటు దూరంలో ఉన్న కాలనీని పట్టించుకోని అధికారులు
అనారోగ్యానికి గురై వైద్యం కోసం వెళ్లాలంటే కాలనీ నుంచి హాస్పిటల్ వెళ్లడానికి గంట ప్రయాణం
600 కుటుంబాలు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న బిసి కాలనీ 17వ వార్డు లో  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి ప్రజలతో స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి  జాన్ వెస్లీ గారు..
ఈ సందర్భంగా  మాట్లాడుతూ... 2012 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది అప్పటినుండి కాలనీ దినదినం అభివృద్ధి చెందుతూ వందలాది కుటుంబాలు జీవిస్తున్న గత బిఆర్ఎస్ పాలకులు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కాలనీ అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టకపోవడం తో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం చాలా దుర్మార్గం జిల్లా కేంద్రంలో ఉన్నాయి కాలనీ పట్ల ఇంత అశ్రద్ధ చేయడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. ఈ కాలనీలో ఇంటి నెంబర్లు లేవు మిషన్ భగీరథ నీళ్లు రావు కరెంటు సక్రమంగా రాదు వైద్యము అందదు, విద్య ఉండదు. రోగాల బారి పడి పేద ప్రజలు రావడం తప్ప మరో మార్గం లేదు. గత అనేక సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తున్న పట్టించుకోని గత పాలకులు ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి కాలనీ అంతా కూడా సిసి రోడ్లు వేయాలని ప్రజలకు బురద నుంచి ప్రయాణం చేయలేక పిల్లలు స్కూల్ కి వెళ్లలేక బడికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ప్రజలు ఒకసారి అడిగితే స్థానిక సమస్యలు పరిష్కారం చేయొచ్చు దీనికి అనేక సంవత్సరాలు నుంచి పోరాటం చేయాలని అధికారులను వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు వేసిన రోడ్లకు వైర్లు బిగించాలి వీధిలైట్లు వేయాలి అవి లేకపోవడంతో ఇళ్లల్లోకి పాములు విష సర్పాలు వచ్చి కాటు వేసి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉన్నదని కాలనీవాసులు చెబుతున్న కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం స్థానిక అధికారులకు మున్సిపల్ సిబ్బందికి తగదని హెచ్చరించారు. 
జిల్లా కలెక్టర్కు కూతవేటు దూరంలో ఉన్న 17వ వార్డు బీసీ కాలనీలో ఇట్లాంటి సమస్యలుంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో అర్థం అవుతుందని వారు అన్నారు. బీసీ కాలనీ మొత్తం కూడా సిసి రోడ్లు వేయాలి. ఇంటర్నల్ డ్రైనేజీ నీళ్లు పోయే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి కాలానికి మంచినీరు సౌకర్యాన్ని కల్పించాలి కాలంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు ,కందికొండ గీత జిల్లా నాయకులు రామయ్య ,శంకర్ నాయక్, మధు కాశన్న సుభాష్  డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ కార్యదర్శి వెంకటేష్ tiptlf నాయకులు విజయ్ బీసీ కాలనీ పరిరక్షణ కమిటీ అంబేద్కర్ రేణుక చారి రవి నరసింహ హేమలత అంజనమ్మ  కాలనీవాసులు తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.. మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన..
లోకల్ గైడ్ :          టేకులపల్లి మండలం లో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ...
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వృద్ధురాలి మృతి
యురియ కోసం రైతులు పడిగాపులు BRS  ధర్నా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డు బీసీ కాలనీలో
రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
బీసీ రిజర్వేషన్ అడ్డుకునే పార్టీలపై యుద్ధభేరి మోగిస్తాం
#Draft: Add Your Title