మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన..

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన..

లోకల్ గైడ్ :          టేకులపల్లి మండలం లో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లను కోరం సురేందర్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. పర్యటనలో భాగంగా మండలంలో 8 కోట్ల 95 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. పాత తండా- రాంపురం గ్రామాల మధ్య ఎత్తైన వంతెన నిర్మాణానికి 2 కోట్ల 50 లక్షల రూపాయలతో మంత్రి శంకుస్థాపన చేశారు.

తావూర్య తండా - కోక్యతండ గ్రామాల మధ్య గల బీటీ రోడ్డు 1 కోటి 45 లక్షల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెట్రం చెలక స్టేజి - పెట్రంచెలక గ్రామ ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రెండు కోట్ల నిధులతో ఎత్తైన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కిష్టారం గ్రామపంచాయతీ గ్రామస్తులు గ్రామంలో ఎవరైనా మరణించిన వ్యక్తి కర్మకాండలు నిర్వహించడానికి ఎంతో అష్ట కష్టాలు పడుతున్న విషయం..ఎమ్మెల్యే కోరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో 3 కోట్ల అభివృద్ధి నిధులతో శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తమ నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధికి సహకరించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు నాణ్యతతో వంతెనను నిర్మించాలని సూచించారు. నాణ్యతలేని బ్రిడ్జిలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించవద్దు. అటువంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానం లేదని వారు తెలిపారు. టేకులపల్లి మండలం ప్రజలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య అండగా ఉన్నారని అన్నారు. అభివృద్ధి పనుల్లో ఏ పనికైనా నేను ముందు ఉంటానని తెలిపారు. ప్రజల అవసరాల మేరకు చేయవలసిన రోడ్డు నిర్మాణ పనులకు ప్రతిపాదనలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ,ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, ఆర్ డి ఓ మధు , తాసిల్దార్ వీరభద్రం, ఎంపీడీవో మల్లీశ్వరి, డీఎస్పీ చంద్రభాను, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్సై ఆలకుంట రాజేందర్, బోడు ఎస్సై పి. శ్రీకాంత్, ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వరరావు, ఇల్లందు ఎస్సై నాగుల మీరా, ఆత్మ కమిటీ చైర్మన్ బోడా మంగీలాల్, పిఎసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇది గణేష్, మూడ్ సంజయ్, బండ్ల రజిని,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, దల్ సింగ్ నాయక్, ఇస్లావత్ రెడ్యా నాయక్, కంభంపాటి శ్రీనివాస్, దళపతి శ్రీనివాస్, లక్కినేని శ్యాంబాబు , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.. మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన..
లోకల్ గైడ్ :          టేకులపల్లి మండలం లో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ...
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వృద్ధురాలి మృతి
యురియ కోసం రైతులు పడిగాపులు BRS  ధర్నా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డు బీసీ కాలనీలో
రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
బీసీ రిజర్వేషన్ అడ్డుకునే పార్టీలపై యుద్ధభేరి మోగిస్తాం
#Draft: Add Your Title