యురియ కోసం రైతులు పడిగాపులు BRS ధర్నా
కేంద్ర రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున రైతులు యూరియ కోసం పడిగాపులు
By Ram Reddy
On
లోకల్ గైడ్మ హబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్ర రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున రైతులు యూరియ కోసం పడిగాపులు ,రైతులు తాము వేసిన పంటలకు ముఖ్యంగా వరి , మొక్కజొన్న పంటలకు కావలసిన యూరియ బస్తాలు తమకు సొసైటీలో అందుబాటులో లేవని ఎన్నో రోజులుగా తాము ఎదురుచూస్తునామని తాము అన్ని పొలం పనులు వదులు కొని ఉదయం టోకెన్ల కోసం రైతు వేదిక దగ్గరికి ఉన్నప్పటికీ వచ్చే అ టోకెన్ తో ఒక బస్తా ఇస్తే ఎటు సరిపోతలేదని మళ్ళీ ఎప్పుడు వస్తదో కూడా తెలియని పరిస్థితిని రైతులు వాపోతున్నారు, మరో వైపు రైతులకు మద్దతుగా కేసముద్రం మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున ధర్నాలో రైతులకు మద్దతుగా పాల్గొనడం జరిగింది,*యూరియా కొరత లేకుండా చూడాలి: నీలం దుర్గేష్*
యూరియా గురించి రైతులు తమ తమ పనులను వదులుకొని మండల కేంద్ర చుట్టుపక్కల ఊర్ల నుండి తండాల నుండి రైతులు మూడు నాలుగు రోజుల నుండి తిండి లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని , అదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని ముఖ్యంగా యూరియా విషయంలో కెసిఆర్ గారు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదని కానీ ఇప్పుడు మూడు నాలుగు రోజుల దగ్గర నుండి టోకెన్లు ఇచ్చుకుంటూ కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి అని బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకునేది ఒకటే అని రైతులకు తప్పనిసరిగా యూరియా కొరత లేకుండా సరిపడ ఇవ్వాలని మండల ఏఈఓ కి విజ్ఞప్తి చేశాడు.
రైతులను ఆదుకోకుంటే యూరియా ఉద్యమమే**:* మాజీ జడ్పిటిసి
మండల రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున ఒక 2000 మంది రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారని, రైతులు తమ పనులన్నీ వదులుకొని మూడు రోజులు దగ్గర నుండి యూరియా బస్తాలు కోసం క్యూలో నిలబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పని వదులుకొని నాట్లు , మొక్కజొన్న పంటల పనులు వదులుకొని యూరియా కోసం క్యూలో నిలబడ్డా కానీ వారికి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే ఒకటే బస్తా దొరికే పరిస్థితి అని ఆ ఒక్క బస్తా కోసం మూడు నాలుగు రోజులు చూసి మళ్ళీ క్యూలో నిలబడే పరిస్థితి ఉందని అదే తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి కొరత లేదని , ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు తప్పనిసరిగా యూరియా రైతులకు కావాల్సిన బస్తాలు సమకూర్చాలని లేని పక్షంలో యూరియా ఉద్యమం మొదలవుతుందని, ఇదే విషయంపై మండల వ్యవసాయ అధికారి మూడు రోజులలో రైతులకు యూరియా బస్తాలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
18 Aug 2025 22:13:41
లోకల్ గైడ్ : టేకులపల్లి మండలం లో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ...