మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూర్చేలా కొత్త జీఎస్టీ రేట్లు
*బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి*
మిడ్జిల్ ఆగస్టు 18(లోకల్ గైడ్):
దీపావళి కానుకగా బిజెపి కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూర్చేలా కొత్త జీఎస్టీ రేట్లు ప్రధాని మోడీ ప్రవేశ పెడుతున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి అన్నారు. సోమవారం మిడ్జిల్ మండల కేంద్రం లో విలేకరుల తో అయన మాట్లాడారు ప్రస్తుతం 28% జీఎస్టీ విధిస్తున్న 90 శాతం ఉత్పత్తులకు గాను 18% శాతానికి కుదించడం అలాగే 12% శాతం ఉన్న ఉత్పత్తులకు కేవలం 5% కుదించేలా బిజెపి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించిందని ఆయన అన్నారు. మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకగా పేద మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూర్చేలా కొత్త జీఎస్టీ విధానాన్ని తీసుకొస్తున్నామని దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగిందని అన్నారు. ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, బైక్లు కార్లు, ఇతర రోజు వారి ఉపయోగపడే వస్తువులపై భారీ తగ్గింపు ఉండనున్నదని అన్నారు అలాగే ప్రతి భారతీయుడు మన రోజువారి దినచర్యలో సాధ్యమైనంతవరకు మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుగోలు చేయాలని దాని ద్వారా దేశ ప్రయోజనాలను మరియు దేశ ఆర్థిక ప్రగతిని సాధించిన వారిమౌతాం అలాగే ప్రతిరోజు భారతదేశంపై విషం చిమ్మే ఇతర దేశాలకు కూడా సరైన బుద్ధి చెప్పిన వారిమవుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వతంత్ర దినోత్సవం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగిందని అన్నారు.
About The Author
Related Posts
