“హరిహర వీరమల్లు దుమ్మురేపినా.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను దాటలేకపోయింది
కోట్లు కొల్లగొట్టినాదిరో..
హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే? అబ్బాయి సినిమాను మాత్రం దాటలేకపోయింది
హరి హర వీరమల్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ డే క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గురువారం (జూలై 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకంటే ముందు బుధవారం సాయంత్రం ప్రీమియర్ షోలు వేశారు. అయిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న మూవీ ఎట్టకేలకు థియేటర్లకు వచ్చేసింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. లేదు.
ఎన్ని కోట్లంటే?
హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన హరి హర వీరమల్లు తొలి రోజు ఇండియాలో రూ. 44.20 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. హరి హర వీరమల్లు బాక్సాఫీస్ కలెక్షన్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం ఇండియాలో ప్రీమియర్ ద్వారా రూ.12.7 కోట్లు, తొలి రోజు రూ.31.5 కోట్లు రాబట్టింది. ఇటీవల విడుదలైన సినిమాలతో పోలిస్తే పవన్ కు ఇదే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కావడం విశేషం. తొలిరోజు బ్రో రూ.30.5 కోట్లు, భీమ్లా నాయక్ రూ.37.15 కోట్లు రాబట్టింది. తొలిరోజు వకీల్ సాబ్ రూ.40.10 కోట్ల నెట్ ను రాబట్టింది.
అబ్బాయి సినిమా
ఈ ఏడాది విడుదలైన ఇతర పెద్ద చిత్రాలతో పోలిస్తే హరిహర వీరమల్లు తన అన్న చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ నెలకొల్పిన రికార్డును మాత్రం అందుకోలేకపోయింది. తొలిరోజు గేమ్ ఛేంజర్ రూ.51 కోట్లు వసూలు చేసింది. అయితే తొలి రోజు రూ.25.35 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'డాకు మహారాజ'ను హరిహర వీరమల్లు దాటేశాడు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం (రూ.23 కోట్లు) ఉంది. ధనుష్ నటించిన కుబేర రూ.14.75 కోట్లు రాబట్టింది. అయిదేళ్లు
హరి హర వీరమల్లు సినిమా పవన్ ఇతర చిత్రాలకు భిన్నంగా కోవిడ్-19, తన రాజకీయ కమిట్మెంట్స్ కారణంగా ఐదేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఈ మూవీ ప్రమోషన్లలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనడం విశేషం. ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రంలో పవన్.. వీర మల్లు అనే దొంగగా, నిధి అగర్వాల్ పంచమి అనే దేవదాసిగా, బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించారు.
భారీ అంచనాలతో విడుదలైన హరి హర వీరమల్లుకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా విమర్శల పాలైంది. సీక్వెల్ కోసం కథను సెట్ చేయడంతో ఫస్ట్ పార్ట్
ముగుస్తుంది.
About The Author
