బలగం మూవీ కోసం పది కేజీల పెరిగాను , నా సిగ్గును చూసే నన్ను సెలెక్ట్ చేశారు - బలగం నటి  సౌదామిని....

బలగం మూవీ కోసం పది కేజీల పెరిగాను , నా సిగ్గును చూసే నన్ను సెలెక్ట్ చేశారు -  బలగం నటి  సౌదామిని....

ఆప్యాయతలు.. పంతాలను వెండితెరపై ఆవిష్కరించింది ఈ . ఈ చిత్రంలో నటించిన వారంతా ఫేమస్ నటీనటులు కాదు. కానీ తమ నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. బలగం మూవీలో నటించి ప్రతి ఆర్టిస్ట్ ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం ఓవైపు ఓటీటీలో విడుదలైనప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ ఈ స్క్రీన్స్ వేస్తున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా తెలియనివారే. కానీ ఈ తో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలకు గుర్తుండిపోయింది. తనే సౌదామిని.

బలగం లో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని. కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం.. అక్కడ ప్రియదర్శి.. సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే.. కేవలం ఎక్స్‏ప్రెషన్స్‏తో సీన్స్ ప్రేక్షకులను నవ్వించాయి. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా.. తన ఎక్స్‏ప్రెషన్స్‏తోనే ఫేమస్ అయ్యింది. ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది.

“ అడిషన్‏కు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలక్ట్ చేశారు. సౌదామిని పేరును వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ లో ప్రియదర్శి చాలా సపోర్టింగ్ గా ఉంటారు. కోసం పది కేజీలు పెరిగాను. కేకులు తినేసి బరువు పెరిగాను. ఫన్ జోనర్ లంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికి వెళ్లినా అన్నయ్యతో వెళ్తాను. చాలా మంది నువ్వు నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాల్లు. నేను స్థాయికి రావడం కారణం వేము సర్. బలగం చూసి డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు. మా లో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు” అంటూ చెప్పుకొచ్చింది సౌదామిని.

Tags:

About The Author

Latest News

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం  ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే...
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్