తరుణ్ సుధీర్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ఏలుమలై’ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ మెలోడీ సాంగ్ విడుదల*

తరుణ్ సుధీర్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ఏలుమలై’ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ మెలోడీ సాంగ్ విడుదల*

*

రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

 

సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటలో చూపించిన లొకేషన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చూస్తుంటే ఈ చిత్రంలో అందమైన ప్రేమ కథ దాగి ఉందని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ‘రా చిలకా’ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో అందరినీ మెప్పించేలా ఉంది. 

 

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

 

నటీనటులు : రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు, నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు నటించారు.

 

సాంకేతిక బృందం

బ్యానర్ : తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్

నిర్మాత : తరుణ్ సుధీర్

సహ నిర్మాత : అట్లాంట నాగేంద్ర

దర్శకుడు : పునీత్ రంగస్వామి

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటింగ్: కె.ఎం. ప్రకాష్

డైలాగ్స్: నాగార్జున శర్మ, పునీత్ రంగస్వామి

సంగీతం: డి. ఇమ్మాన్

పీఆర్వో : సాయి సతీష్

Tags:

About The Author

Latest News

నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలి నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలి
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా :  జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎస్వీ ప్రభుత్వ జూనియర్...
కాళేశ్వరం  ఆలయంలో అసలేం జరుగుతుంది 
వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
చింతకుంట బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ..
హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం ఫోన్ నంబర్లు
మెరుగైన రవాణా సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి..