మెరుగైన రవాణా సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి..
By Ram Reddy
On
సుల్తానాబాద్, ఆగస్టు. 11. లోకల్ గైడ్
సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలోని రాజీవ్ నగర్ నుండి కాల్వ శ్రీరాంపూర్ రహదారి వరకు రూ.1 కోటి 50 లక్షల సీఆర్ఆర్ గ్రాంట్ నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ...
మెరుగైన రవాణా సదుపాయాలు ఉంటేనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కదంబాపూర్ గ్రామంలోని రాజీవ్ నగర్ నుండి కాల్వ శ్రీరాంపూర్ ఆర్అండ్ బీ రహదారి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పారు. నెలరోజుల్లోగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, కదంబాపూర్ లోని వివేకానంద విగ్రహం నుండి కనుకుల చౌరస్తా వరకు బిటి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ రోడ్డు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే గారు చెప్పారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 16:17:40
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా : జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎస్వీ ప్రభుత్వ జూనియర్...