నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలి
జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా :
జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎస్వీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు గ్రామంలోని అన్ని పాఠశాలల యందు ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది
ఈ సందర్భంగా స్థానిక హెల్త్ అసిస్టెంట్ కూన గోవర్ధన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసుగల బాలబాలికలు ప్రతి ఒక్కరూ ఈనెల 11 వ తారీఖున ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్స్ సంవత్సరానికి అనగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఇచ్చే టాబ్లెట్స్ వాడినట్లయితే నులిపురుగుల నుండి వచ్చే వేదల పట్ల రక్షణ పొందవచ్చు అని సూచించారు
నులిపురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలు పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాత పూజించాలి. ఆరుబయట మలవిసర్జన చేయవద్దు పాదరక్షలు లేకుండ తిరగరాదు గోళ్లు వారానికి ఒకసారి కత్తిరించుకోవాలి భోజనానికి ముందు మలవిసర్జన తర్వాత ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
నులిపురుగులు ఉన్న విద్యార్థిని విద్యార్థులు బలహీనంగా ఉంటారు రక్తహీనత ఉంటుంది అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది నీరసంగా ఉంటారు మలద్వారం దగ్గర దురద ఉంటుంది ఆకలి మందగిస్తుంది పై లక్షణాలు ఉన్న విద్యార్థినిలు నులిపురుగుల నుండి ఆరోగ్య శాఖ వారు అందించే టాబ్లెట్లు వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని సూచించారు
ఇట్టి కార్యక్రమంలో ఏఎన్ఎం గజవర్ధనమ్మ ఆశా వర్కర్లు పార్వతి జయమ్మ వరలక్ష్మి షమీం విజయ లీల మరియు పాఠశాల కళాశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది
About The Author
