కాళేశ్వరం ఆలయంలో అసలేం జరుగుతుంది
అవినీతి ఆరోపణలపై అధికారుల పర్యవేక్షణ కరువు
By Ram Reddy
On
దీని వెనక ఉన్న సూత్రధారి ఎవరు
భూపాలపల్లి, లోకల్ గైడ్ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఆలయం పై ఇటీవల వస్తున్న ఆరోపణలకు దక్షిణ కాశీగా పేరుగాంచి అంచలంచెలుగా ఆలయం అభివృద్ధి చెందుతున్న క్రమంలో కాళేశ్వరం పుణ్యక్షేత్రమైన ఆలయం పై సోషల్ మీడియా లో పలు రకాలుగా దేవస్థాన ఆలయ సిబ్బందిపై ఎన్నో ఆరోపణలు వస్తున్న ఆ అధికారిపై చర్యలు ఎందుకు కానరావని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్న ఇక్కడున్న సిబ్బంది ఎంతో భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహించాల్సింది పోయి తమకు ఇష్టం వచ్చిన రీతిలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని పట్టించుకోకపోవడం ఆలయం యొక్క ప్రతిష్టలు దిగజార్చడానికి పూనుకున్నారా అనే విమర్శలకు దారితీస్తుందని పలువురు ఆరోపించారు. ఈ ప్రాంతంలో కాళేశ్వరం ఆలయం అంటే సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి మొక్కలను సమర్పించడానికి వస్తున్న తరుణంలో ఆలయ అభివృద్ధి మెరుగుపడుతున్న క్రమంలో ఆలయ సిబ్బందిపై ఆరోపణ వస్తున్న చర్యలు తీసుకోకపోవడం ఏంటని అదే కాకుండా ఏకాధిపత్యం చెలాయిస్తున్న ఆ అధికారిని ఎందుకు సస్పెండ్ చెయ్యరు అని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు ఆలయం పేరు ప్రతిష్టలను దిగదార్చడానికి పూనుకున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కొందరు ఆలయ సిబ్బంది కిందిస్థాయి వర్కర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనిపైన కూడా ఉన్నత అధికారులు దృష్టి సారించి కాళేశ్వరం ప్రతిష్టతను దిగదార్చకుండా దేవస్థానం యొక్క అభివృద్ధికి పాటుపడాలని ఉన్నత అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారుTags:
About The Author

Latest News
11 Aug 2025 17:10:55
లోకల్ గైడ్ నారాయణపేట ఆగస్ట్ 11 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం
నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదు లకు ప్రాధాన్యతనిస్తూ త్వరి తగతిన...