ప్రశాంత ఎన్నికలకు.. పటిష్ట బందోబస్తు.

గొడవలు, ఘర్షణలు జరగకుండా పోలీసుల నిఘా సమస్యాత్మక ప్రాంతంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు. 

ప్రశాంత ఎన్నికలకు.. పటిష్ట బందోబస్తు.

తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య.

లోకల్ గైడ్/తాండూర్:
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 250 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఇప్పటికే అప్రమత్తమయ్యామన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలోని
 సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు పోలీస్ బలగాలను నియమించినట్లు తెలిపారు.ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని 15 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను మొహరించి ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రల వద్ద స్పెషల్ పోలీసులతోపాటు క్యూఆర్టి బృందాలు, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే, పోలింగ్ రోజున మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయడంతో పాటు, అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేపట్టామన్నారు. ఈ  మేరకు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాగా
ఓటర్లు భయాందోళన లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాలు, సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.