వనపర్తి జిల్లా ఫిబ్రవరి 07 ( లోకల్ గ్రేడ్ )
వనపర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 25వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాతర్ల రామకృష్ణ గడపగడపకు ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు మమ్మల్ని గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాతర్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రచారంలో భాగంగా వారు ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయల్లోకి వచ్చానని ఓటర్లతో వారన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజా పాద సేవ చేస్తాను. ఘణపురం మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలో సజీవంగా ఉన్నాయన్నారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా 25వ వార్డులో మిగిలిపోయిన పనులను మళ్లీ పునర్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. 25 వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దేందుకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాతర్ల రామకృష్ణ కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు.మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ...మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వృద్ధులకు వృద్ధాప్య, వితంతువులకు పెంఛన్ పుట్టిన పసికూన మొదలు పండు ముసలి వరకు సంక్షేమ పథకాలు నిస్వార్ధంగా అందించార న్నారు.ఓటర్లకు ఏ కష్టం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాతర్ల రామకృష్ణ వెన్నంటి ఉంటారని వార్డు లో అండర్ డ్రైనేజీ,సిసి రోడ్లు, వీధిలైట్లు సీసీ కెమెరాలు మొదలగు ఇతర ప్రజా సంక్షేమానికి పాటుపడుతారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్, శివన్న,సురేందర్, లోకాజీ, జయమ్మ, చోటు, అఖిలేందర్, వార్డులో భారీ సంఖ్యలో మహిళలు, యువకులు పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.....