అంబేద్కర్ యువజన సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి.

హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

అంబేద్కర్ యువజన సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి.

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

పఠాన్ చేరు నియోజకవర్గం పఠాన్ చేరు  డివిజన్ పరిధిలోని చైతన్య నగర్‌లో గల బాబు జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్‌లో అంబేద్కర్ యువజన సేవా సమితి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి విలువల సాధనకు యువత ముందుండి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజాభివృద్ధి కి యువజన సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు రుద్రారం శంకర్, నర్రా బిక్షపతి, పృథ్విరాజు, వెంకటేష్, శ్రీ రాములు, అంబేద్కర్ యువజన సేవా సమితి నూతన అధ్యక్షులు బి. కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య