టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక
టీజేఎంయూ ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటా ఎండీ ఫస్సిద్దిన్
ఖమ్మం : లోకల్ గైడ్ :
తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయూ) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీజేఎంయూ ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించి, ఖమ్మం జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా
ఎండీ ఫస్సిద్దిన్ ను ఏకగ్రీవంగా ఎప్పికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఫస్సిద్దిన్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన టీజేఎంయూ ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్, ఈసీ మెంబర్ సామల ప్రవీణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో అనునిత్యం పని చేసి సభ్యులను పెంచుతానని, వారికి జర్నలిజంలో ఎటువంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, టీజేఎంయూ స్టేట్ లీగల్ అడ్వైజర్ గోరెంట్ల జానకి రామయ్య (ఎంఏ ఎల్ ఎల్ బీ), టీజేఎంయూ స్టేట్ ఈసీ మెంబర్ సామల ప్రవీణ్, ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెంకట్రాజు సహా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
