కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ
By Ram Reddy
On
తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కేశంపేట మండల మాజీ జడ్పీటీసీ
లోకల్ గైడ్ షాద్ నగర్
ఈ సందర్భంగా వార్డు వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు.వార్డులోని వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజల విశ్వాసమే తమకు అసలైన బలమని వారు స్పష్టం చేశారు. 28వ వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా తాగునీటి సమస్య, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి మౌలిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా పరిష్కారాలు చూపుతామన పేర్కొన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలీం సఖిబ్, కబీర్ అహ్మద్, జాఫర్ ఖాన్, దేవయ్య, కత్తి చంద్రశేఖర్ అప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అనసూయమ్మ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రజిత, రవి, మాజీ ఎంపీటీసీ చంద్రపాల్ రెడ్డి, వీర్లపల్లి మాజీ సర్పంచ్ నర్సింలు,విఘ్నేష్ రెడ్డి, బీసీ సేన నాయకులు జలజ, శ్రవంతి రాజ్, మరియు కాలనీవాసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు కాలనీ మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Feb 2026 22:02:09
లోకల్ గైడ్ : షాద్‌నగర్
అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
