మిర్యాలగూడ ఫిబ్రవరి 10
సమాజంలో దళితులపై రోజుకిరోజు దాడులు పెరుగుతున్నాయి సంబంధం లేని విషయం తన బాధ్యులని చేసి దాడులు చేస్తున్నారని కెవిపిఎస్ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెముడాల పరుశురాములు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మిర్యాలగూడ లోని బాపూజీ నగర్ లోని దళిత మహిళ అయినటువంటి మొండి కత్తి జనకమ్మ పై విచక్షణ రహితంగా దాడి చేసిన కొత్త శ్రీను ఆయన భార్య స్వప్నాలు మాదిగలు మా ఇంటి ముందు నుండి వెళ్లొద్దు అని అసలు మాదిగ కులస్తులు మా ఇంటి వైపు కూడా చూడొద్దని రోడ్డుపై వెళ్తున్న జానకమ్మ పై రక్తాలు వచ్చేలా దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు, జానకమ్మను పరామర్శించి అనంతమైన మాట్లాడుతూ , హైటెక్ యుగంలోని ఈ రోజుల్లో దళితులనే కారణంగా ఇంకా దాడులు జరగడం హేయమని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు అటం టూ మర్డర్ కేసులు పెట్టి నిందితులను కఠినంగా చట్టపరంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వారిని పరామర్శించిన వారు ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యులు కంభంపాటి శంకర్ మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి సైదా నాయక్ దళిత మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు చిత్రం ఉమాదేవి నకిరేకంటి కృష్ణ ,అజయ్ తదితరులు పాల్గొనారు.