కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) ఆధ్వర్యంలో ఈనెల 22న అమరావతిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే, అంబేడ్కర్-మండల్, కర్పూరీ ప్రాంగణంలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీలపై దాడులు , సామాజిక బహిష్కరణ జరుగుతుందని, ఈ నేపథ్యంలో బీసీలకు రక్షణ చట్టం తేవాలని, రాజధాని ప్రాంతంలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో చట్టసభల్లో 44శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ సింహ గర్జనకు లక్షలాదిమంది బీసీలు తరలివచ్చి , జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.