పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి.
ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు.
గద్వాల, లోకల్ గైడ్ :
మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అధికారులు, ఇతర సిబ్బంది పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. గోనుపాడు గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లోనీ 77 వార్డుల్లో 189 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ అధికారులకు సహక రించేందుకు రిటర్నింగ్, జోనల్ అధికారులు, మున్సిపల్, పోలీస్ యంత్రాంగం ఇతర సిబ్బంది కలిపి సుమారు 2000 మంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారన్నారు.అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలోనే ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమును ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటుచేసిన నాలుగు హాల్స్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఎస్పి మొగిలయ్య, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, తహసిల్దార్ మల్లికార్జున్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
