విద్యార్థులకు టై,  బెల్టు,బ్యాడ్జి పంపిణీ

బిఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షుడు  దారమోని గణేష్

విద్యార్థులకు టై,  బెల్టు,బ్యాడ్జి పంపిణీ

లోకల్ గైడ్  (కల్వకుర్తి) :  కల్వకుర్తి మండలంలోని పంజగుల ప్రాథమికోనత ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దారమోని గణేష్ మిత్రుడు ఆస్ట్రేలియా దేశంలో స్థిరపడిన ముకురాల గ్రామానికి చెందిన కొప్పుల జై వర్ధన్ రెడ్డి అనే ప్రవాస భారతీయుడు సహకారంతో పంజుగుల గ్రామంలో చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై,బెల్టు,బ్యాడ్జి ఉచితంగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ధారమోని గణేష్ మాట్లాడుతూ గ్రామాలలో విద్యార్థులకు తనకు తోచిన సహకారాన్ని గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నానని ఇప్పటికీ దాతల సహాయంతో సుమారు 6 లక్షలకు పైగా ఖర్చుతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా కృషి చేశానని ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉంటేనే విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత విద్యను అభ్యసించి పల్లెల నుండి గ్రామాల నుండి ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆశాభావంతోనే పంజుగుల్  గ్రామంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన వరవడితో విద్య అందించే విధంగా సహకరిస్తుంటారని, ఈరోజు పాఠశాల విద్యార్థులకు టై , బెల్టు , బాడ్జిని అందించడం కొరకు సహకరించిన కొప్పుల జై వర్ధన్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామ ప్రజల తరఫున,విద్యార్థిని తల్లిదండ్రుల తరఫున దారమోని గణేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గుత్తి కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం రామేశ్వరయ్య  ఆంజనేయులు, శివకుమార్, వైడూర్య, మురళి, గ్రామ యువకులు బాలరాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం  ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే...
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్