రాఖీ పండగ పర్వదినాన తీవ్ర విషాదం.
- ఆనందం మధ్యలో ఆవేదన.
By Ram Reddy
On
- రాఖీ పండగ ఉత్సాహంలో ఊహించని దుర్ఘటన. - మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి!
లోకల్ గైడ్/ తాండూర్:
రాఖి పౌర్ణమి పర్వదినాన తీవ్ర విషాదం నింపిన ఘటన పెద్దేముల్ మండలంలో శనివారం చోటు చేసుకుంది.మండల పరిధిలోని ఇందూర్ గ్రామానికి చెందిన జేట్టిగల.బంధ్యప్ప(38)మృతి అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.రాఖీ పౌర్ణమి రోజున సంతోషం నిండిన వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.స్థానికంగా ఉదయం సోదర సోదరీమణులు ఆనందంగా రాఖీ కట్టుకునే వేడుకల్లో పాల్గొంటుండగా,అకస్మాత్తుగా జరిగిన దుర్ఘటన అందరినీ కలచివేసింది.పండుగ సందడి మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు,పరిసర ప్రాంత ప్రజలు మౌనంలో మునిగిపోయారు.పండుగ ఆనందం కన్నీటి కళ్లతో ముగియడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... ఇందూరు గ్రామానికి చెందిన కొట్ పల్లి మార్కేట్ కమిటీ డైరెక్టర్ జెట్టిగల.బంధ్యప్ప(38) ఇటీవల లివర్,ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ, తాండూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొద్దిరోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు.నిన్న రాత్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లండి అని చెప్పిన కొద్ది సేపటికే ఆరోగ్యం విషమించి తెల్లవారుజామున 4 గంటల సమయంలో బంధప్ప చనిపోయినట్లు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు వెల్లడించారు. చనిపోయిన బంధ్యప్ప కు భార్య, ముగ్గురు పిల్లలు,అందులో ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఇది ఇలా ఉంటే....బందప్ప ఎల్లప్పుడూ అందరితో వినయంగా,మర్యాదగా ఉంటూ ఆప్యాయతతో పలకరించేవాడని,కాంగ్రెస్ పార్టీ కోసం ఎల్లప్పుడూ ముందుండే కార్యకర్త,పార్టీలో చురుకైన వ్యక్తిగా పనిచేసేవారని పలువురు ఆయనను స్మరించుకున్నారు.ఎక్కడైనా తనకు కావలసినవారు కనిపిస్తే అన్నా, తమ్ముడు అని చాలా వినయంగా పలకరించేవాడని ఆయన వ్యక్తిత్వం గురించి గ్రామస్తులు, స్నేహితులు బంధువులు తెలిపారు.ఏదేమైనా పండుగ పర్వదినాన ఇలాంటి ఘటన జరగడం అందరినీ విస్మయానికి గురిచేసిందని స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.Tags:
About The Author

Latest News
11 Aug 2025 20:18:07
మహబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ : మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిదిగా సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జాతీయ నులిపురుగుల...