సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 

నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 

లోకల్ గైడ్    నారాయణపేట ఆగస్ట్ 11: ప్రస్తుతం కురు స్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఆసుప త్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మద్దూరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషంట్ ల వివ రాలను రిసెప్షన్ లో రిజిస్టర్ ను చూసి తెలుసుకున్నారు. చిన్న పిల్లల వార్డుకు వెళ్ళి రోజుకు ఎంతమంది చిన్నా రులు ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నారని చిన్న పిల్లల వైద్య నిపుణుడు క్రాంతి కిరణ్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల కంటే అధికంగా మరి కొన్ని పడకలతో చికిత్స అందించా ల్సిన అవసరం ఉందని ఆర్ఎంఓ పావని, వైద్యుడు క్రాంతి కిరణ్ కలెక్టర్ కు తెల పగా, స్పందించిన కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలోని 5 పడకలను వినియోగించుకోవాలని సూచించారు. ఆస్పత్రికి అవ సరమైన స్టాఫ్, ఇతర వైద్య పరికరాల జాబితా ఉన్నతాధి కారుల దృష్టిలో ఉందని, త్వరలో మంజూరు అయ్యే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. ఎక్కువగా చిన్న పిల్లల కు జ్వరాలు వస్తున్నా యని, వైద్యులు అందుబా టులో ఉండి సేవలు అందిం చాలని ఆమె ఆదేశించారు. అయితే ఆస్పత్రికి సంబంధిం చి విద్యుత్ సరఫరాలో కొంత ఆటంకం ఏర్పడుతోందని ఆర్ఎంవో తెలపగా వెంటనే మరమ్మతు చేయించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి జన రేటర్ కూడా మంజూరు అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఒకరిద్దరు రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. 

 

*గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్*

మద్దూరు మండల కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగు తున్న గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆ పాఠశాలలోని 8 వ తరగతి గదికి వెళ్ళి అల్ఫాహారం ఏం ఇచ్చారని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పాఠశాల వంటగది కి వెళ్ళి మెనూ బోర్డును పరిశీ లించారు. మెనూ ను క్రమం తప్పకుండా అమలు చేయా లని ప్రిన్సిపల్ కు సూచించా రు. మెస్ కమిటీ విద్యార్థినుల తో మాట్లాడారు. రోజు భోజ నం ఎలా ఉంటుందని, అంద రూ అల్ఫాహారం భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుగుతున్నారా ? లేదా అని తెలుసుకున్నారు. పాఠశాల లో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతున్నారా ? అని ప్రశ్నించగా, కేవలం ఒక విద్యా ర్థిని మాత్రమే చిన్నపాటి రుగ్మత తో ఉందని, ప్రస్తుతా నికి బాగానే ఉందని ఏ ఎన్ ఎం తెలిపారు. పాఠశాలలో సిక్ రూమ్ ఉందా అని కలెక్టర్ ఆరా తీశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని ఆమె అడగడంతో ఏమీ లేవ ని ప్రిన్సిపల్ తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుత సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్ర మత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పాఠశాల ను పరి శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పక్కనే ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి ఉందని, ఎవరైనా అనారో గ్యానికి గురైతే వెంటనే ఆస్ప త్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించాలన్నారు. పాఠశాల లో ఒక్క మలేరియా, డెంగ్యూ కేసు రాకుండా అన్ని జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. పాఠ శాల, పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించి, పాఠశాల పరిసరాల చుట్టూ దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని మున్సిపల్ అధికారిని ఆదేశించారు. అలాగే పాఠశాల కు సంబం ధించి మరో అద్దె భవనంలో ఉంటున్న విద్యార్థినులు భోజనానికి ఇక్కడికి వచ్చే టప్పుడు చెప్పులు లేకుండా రావద్దని, వారిని తీసుకువచ్చే టప్పుడు టీచర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థినిలు వచ్చి వెళ్లే దారిలోనూ విష పురుగులు తిరగకుండా ఆ దారిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారికి సూచిం చారు. వంట గది పక్కనే ఉన్న 9 వ తరగతి విద్యార్థి నులతో కలెక్టర్ మాట్లాడారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా కార్యక్రమం లేదా అని ప్రశ్నిం చారు. ఇక్కడి విద్యార్థినులకు లేవని ప్రిన్సిపల్ తెలిపారు. పాఠశాల రెండు భవనాలలో మొత్తం ఎంతమంది విద్యా ర్థినులు ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించగా ఒక భవనంలో 360, మరో భవనంలో 168 మంది విద్యార్థినులు ఉండి చదువుకుంటున్నారని ప్రిన్సి పల్ తెలపగా రోడ్డు అవతలి వైపు భవనంలో ఉన్న 168 మంది విద్యార్థినులను రేని వట్ల వెళ్ళే మార్గంలోని పాఠ శాల భవనం ముందు ఉన్న మరో అద్దె భవనంలో కి మార్చాలని అప్పుడు రెండు భవనాలు ఎదురెదుగా ఉంటా యని, విద్యార్థినులు దూరం నడిచి వెళ్ళే ఆస్కారం ఉండ దని కలెక్టర్ తెలిపారు. గురు కుల పాఠశాల నిబంధనలు ఎలా ఉన్నాయో చూసి కొత్త భవనంలోకి విద్యార్థినులను మార్చాలని ఆమె సూచించా రు. రెండు వేర్వేరు భవనా లలో ఉండి, అక్కడి నుంచి ఇక్కడికి విద్యార్థినులు వచ్చి వెళ్లి ఇబ్బందులు పడే కంటే ఒకే చోట ఉన్న వేర్వేరు భవ నాలలో ఉండటం మంచిదని కలెక్టర్ తెలుపుతూ వీలైనంత త్వరగా కొత్త భవనంలోకి మార్చాలని ఆదేశించారు. 

ఫోటో రైట్ అప్:2.ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

----------------------------------------

Tags:

About The Author

Latest News

విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!! విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
లోకల్ గైడ్: మహబూబాబాద్ జిల్లా :విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషిచేయనున్నట్లు మహబూబాబాద్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. విజేందర్ రెడ్డి అన్నారు.సోమవారం నెల్లికుదురు మండలంలోని...
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ
నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం