పోలింగ్ కు సర్వం సిద్ధం
పంపిణీ కేంద్రాన్ని సంద ర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నా యక్
నారాయణపేట ఫిబ్రవరి 10:
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను మంగళ వారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు.
ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూ షన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వ హణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకో వాలని కలెక్టర్ సూచించారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయం లో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబ స్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తి నా వెంటనే ఆర్వో, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తేవాలని సూచించారు.స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్ళను సైతం పరిశీలించిన కలెక్టర్, సీ.సీ టీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సకాలంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో దివ్యాం గులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నా రు. సదుపాయాల కల్పన విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా అన్ని వస తులు అందుబాటులో ఉండా లని, ప్రశాంత వాతావరణం లో సజావుగా ఎన్నికలు జరి గేలా కృషి చేయాలని అన్నా రు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదు ర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంతో అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీ సర్ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ గోల్కొం డ నర్సయ్య, మాస్టర్ ట్రైనర్, ఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3.ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్న సిబ్బంది.
4.పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
-----------------------------------------
